Site icon NTV Telugu

Zero Shadow : 9 రోజుల దాకా నీడ మాయం.. ఎందుకంటే..?

Zero Shadow

Zero Shadow

Zero Shadow : ఇప్పుడు భూమి మీద ఓ అద్భుతం జరగబోతోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మన నీడ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కనిపించదు. ఈ తేదీల్లో మధ్యహ్నం టైమ్ లో 2 నిముషాల పాటు మన నీడ కనిపించదు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు సార్లు ఈ రకంగా మన నీడ కనిపించకుండా పోతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది మకర రేఖ, కర్కాటక రేఖ మధ్యలో ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో సూర్యుడి కిరణాలు లంబంగా పడుతాయి. ఆ సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ కనపించకుండా పోతుంది.
Read Also : Balakrishna : బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ..?

భూమి వక్షం 23.5 వంపుగా ఉన్నందున సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న టైమ్ లో.. సూర్యుడి స్థానం కూడా మారుతుంది. ఆ టైమ్ లోనే ఈ రెండు రేఖల మధ్య సూర్య కిరణాలు లంబంగా పడి మధ్యాహ్న సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ రెండు నిముషాల పాటు కనిపించదు. దీన్నే జీరో షాడోగా పిలుస్తారు. గతంలో ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని నెపోలియన్ అనే సినిమా కూడా తెలుగులో వచ్చింది. అయితే ఇలాంటి సైన్స్ ప్రకారమే ఆ నీడ కనిపించదు అని ఆ సినిమాలో చూపించలేదు. కేవలం ఏదో ఊహించి నీడ పోయింది అనే కాన్సెప్టుతో ఆ మూవీ తీశారు. అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ టాపిక్ తెరమీదకు రావడంతో.. 2017లో వచ్చిన నెపోలియన్ గురించి చర్చ జరుగుతోంది.
Read Also : Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..

Exit mobile version