NTV Telugu Site icon

Prabhas: ‘సలార్’ బిగ్ షాక్? అంత పని చేయకు నీల్ మావా…

Salaar

Salaar

ప్రస్తుతం ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యే సాలిడ్ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘సలార్’ మాత్రమేనని కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. అంటే, సలార్ రాకకు మరో నెలన్నర మాత్రమే ఉంది. అయినా కూడా సలార్ మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు15న సాంగ్ అప్డేట్ ఉంటుందని అంటున్నా, ఇంకా క్లారిటీ లేదు. అయితే టీజర్ రిలీజ్ సమయంలో ఆగష్టులో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆగష్టులో రెండు వారాలు అయిపోయాయి. అయినా కూడా సలార్ టీం మాత్రం సైలెన్స్ మెయింటేన్ చేస్తోంది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ 200 రోజులు, వంద రోజులు, యాభై రోజులు అని కౌంట్ డౌన్ చేస్తున్నారు కానీ ప్రశాంత్ నీల్ మాత్రం చాలా కూల్‌గా ఉన్నాడు.

టీజర్ తర్వాత హోంబలే ఫిలింస్ నుంచి ఎలాంటి కొత్త అప్డేట్ బయటికి రాలేదు. దీంతో.. నీల్ మావా ఇంకెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు? సాలిడ్ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తాడని… సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పోస్ట్ ప్రొడక్షన్ కారంణగా చిత్ర యూనిట్ బిజీగా ఉన్నప్పటికీ… అప్డేట్స్ పరంగా ఏ మాత్రం యాక్టీవ్‌గా లేదు. అసలు సలార్ టీం ఎందుకు సైలెంట్‌గా ఉంది? అనేదే ఇప్పుడు మేజర్‌గా వినిపిస్తున్న డౌట్. అంతేకాదు… కొంపదీసి మళ్లీ సలార్ సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇందులో ఏ మాత్రం నిజం లేకపోయినా… ఒకవేళ ప్రశాంత్ నీల్ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతకంటే బిగ్ షాక్ మరోటి ఉండదు. ఇప్పటికైతే సలార్ వాయిదా పడే సూచనలు కనిపించట్లేదు, మరి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి.