NTV Telugu Site icon

World Cup 2023 : ఒక్క థియేటర్లో కూడా హౌస్ ఫుల్ బోర్డు పడలేదు!

World Cup Final 2023 Trophy

World Cup Final 2023 Trophy

Zero Housefulls for movies Due to World Cup 2023: ఇండియా vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ దెబ్బతో థియేటర్లలో సినిమాలకు జీరో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. సాధారణంగా, మ్యాట్నీ ఫస్ట్ షోల కోసం థియేటర్లలో అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ నమోదు చేయడంతో, సినిమాలకు ఆదివారం బుకింగ్‌లు చాలా బలంగా ఉంటాయి. కానీ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ కారణంగా ఇండియన్ సినిమాలోని అన్ని భాషల రిలీజ్ సినిమాలు ప్రభావితమయ్యాయి. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్స్ లు లేవు. ఆశ్చర్యకరంగా, ఏ ఒక్క సినిమా కూడా ఫాస్ట్-ఫిల్లింగ్ మోడ్‌లో లేవు. ఫైనల్ మ్యాచ్ ఊహించని, భారీ రేంజ్లో ప్రభావం చూపింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్‌లో ఒక్క షో కూడా హౌస్ ఫుల్ అవలేదు. ప్రసాద్స్, ఏఎంబీ లాంటి ఐకానిక్ మల్టీప్లెక్స్‌లలో కూడా ఆశించిన ఆక్యుపెన్సీ నమోదు కాలేదు.

IND vs AUS: గత 10 ఓవర్ల నుంచి లేని బౌండరీ.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

ODI ప్రపంచ కప్ ఈ విధంగా ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు, ఒకవేళ అలా ఊహించి ఉంటె కనుక సినిమాల రిలీజ్ ల విషయంలో వేరే నిర్ణయం తీసుకుని ఉండేవారేమో?. సల్మాన్ ఖాన్ టైగర్ 3, తమిళ చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్, తెలుగు చిత్రం మంగళవారం,. కన్నడ డబ్బింగ్ సప్త సాగరాలు ధాటి సైడ్ బి సహా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ద్వారా అన్ని సినిమాలు ప్రభావితమయ్యాయి. ఇటీవల భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా నవంబర్ 15న థియేటర్ల ఆక్యుపెన్సీని ప్రభావితం చేసింది. 20 ఏళ్ల తర్వాత, భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది, కాబట్టి ప్రతి భారతీయుడు ఇండియా కప్ కొట్టాలని ఆశిస్తున్నాడు. ఇక మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది, అంటే భారతదేశం మొదట బ్యాటింగ్ చేస్తుంది.

Show comments