Site icon NTV Telugu

Hanuman: హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై కీలక ప్రకటన

Jai Hanuman

Jai Hanuman

Zee 5 Announced Hanuman to stream soon: సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది. దానికి తోడు మధ్యలో శివరాత్రి రావడంతో కచ్చితంగా ఆ రోజు స్ట్రీమయ్యే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు అయితే 16వ తేదీ నుంచి ఓటీటీలోకి రావచ్చు అంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ వేస్తూ ఈ సినిమా డిజిటల్ తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన జి ఫైవ్ సంస్థ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సుదీర్ఘ వెయిటింగ్ కి ఒక ఎండ్ పడింది, హనుమాన్ త్వరలో జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది, తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమా అందుబాటులో ఉండబోతోంది ఇతర అప్డేట్స్ కోసం మా ట్విట్టర్ ఐడి ఫాలో అవ్వండి అంటూ రాసుకొచ్చారు.

Ajith Kumar – Adhik: బ్రేకింగ్: అజిత్ హీరోగా మైత్రీ మేకర్స్ సినిమా

బహుశా 16వ తేదీ లోపు ప్రసారమయ్యే అవకాశం ఉందని అయితే ప్రచారం జరుగుతోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడమే కాదు 92 ఏళ్ల తెలుగు సినీ సంక్రాంతి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సినిమాగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతికి మరో మూడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ చివరికి ఈ సినిమా ఆ అన్ని సినిమాల కలెక్షన్స్ కలిపితే ఎంత వస్తుందో అంతకుమించి కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

Exit mobile version