బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. ఆమె పై 2018 లో కేసు నమోదైంది.. కోల్ కతా లోని దుర్గాపూజకు సంబందించిన ఈవెంట్ కు ఆమె హాజరు కావాల్సింది.. రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హాజరు కాలేకపోయింది.. దానిపై ఈవెంట్ నిర్వాహకులు మండిపడటమే కాదు.. పోలీసులకు పిర్యాదు చేశారు.. ఆమె మోసం చేసిందని ఆమెపై, ఆమె మేనేజర్ పై చీటింగ్ కేసును పెట్టారు.. ఈ విషయం పై వివరణ ఇవ్వాలని కోరారు..
ఆ సమయంలో కోర్టుకు జరీన్ హాజరు కాలేదు.. దాంతో ఆమె పై అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆమె హాజరైంది.. తన ఆధార్ కార్డును సమర్పించింది.. ఆమె చెప్పిన సమాధానాలు కోర్టుకు నచ్చకపోవడంతో ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది..
అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసు లో పెద్దగా పురోగతి కనిపించలేదు.. ఇప్పుడు కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది.. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసులో రూ.30 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరు చేసింది.. అలాగే ఆమెను అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లోద్దని ఆదేశించింది. ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది… ఒకవేళ కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..
