Site icon NTV Telugu

Vijayasai Reddy: హీరోల కొడుకులే హీరోలా.. వాళ్ళకి ఎందుకంత రెమ్యునరేషన్?

Vijayasai Reddy

Vijayasai Reddy

YSRCP MP Vijayasai Reddy comments on heros remuneration: రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సినిమా బడ్జెట్లో అధిక భాగం హీరోల రెమ్యూనరేషన్లే అని వెల్లడించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు కానీ బడ్జెట్లో మూడో వంతు బడ్జెట్‌ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభలో సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు విజయసాయి రెడ్డి సూచించారు. ఇక సినిమా కోసం కష్టపడి పనిచేసే కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇచ్చి సరిపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?

సినిమా అంటే హీరో ఒక్కడే కాదని స్పష్టం చేసిన ఆయన బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని, ఈ మేరకు కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు. హీరోల కొడుకులే ఎందుకు హీరోలు అవుతున్నారు అని ప్రశ్నించిన ఆయన దేశంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన వారు ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. కానీ హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్నా, టాలెంట్ ఉన్నవారు ఉన్నా వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. చైనా కంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నారు కానీ అక్కడ 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. అంతేకాదు సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ పొందిన సినీ నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version