Site icon NTV Telugu

ఎన్టీఆర్, చరణ్ ల ట్యాలెంట్ కు యూట్యూబ్ ఫిదా

rrr

rrr

యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్ చేయడం ప్రారంభించింది. “ఆర్ఆర్ఆర్” స్టార్స్ పై యూట్యూబ్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also : ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి

మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” నుంచి విడుదలైన “నాటు నాటు” సాంగ్ దుమ్మురేపుతోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చేసిన డ్యాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే యూట్యూబ్ కూడా వాళ్ళ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి ఫిదా అయ్యింది. యూట్యూబ్ ఇండియా తన ట్విట్టర్‌ అకౌంట్ లో “నిజం చెప్పాలంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ ఇప్పటికీ 0.5 రెట్లు వేగంగా అనిపిస్తుంది. కొంతమంది వీళ్ళ డ్యాన్స్ ఇంటర్నెట్ కన్నా స్పీడ్ గా ఉందని అన్నారు.. నిజమే” అంటూ ట్వీట్ చేసింది.

Exit mobile version