NTV Telugu Site icon

NTR: ఇక్కడ హిట్ సినిమాలకే దిక్కులేదు.. అట్టర్ ప్లాప్ రీ రిలీజ్ ఏంటి బాసూ

Ntr

Ntr

NTR: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతకు ముందులా లేదు. కథ లేకుండా ఎలా పడితే అలా తీసేసి హిట్ చేసేద్దాం అనుకుంటే మాత్రం పొరబడినట్లే. ఇప్పుడు ప్రేక్షకులు స్టార్లు.. సూపర్ స్టార్లు.. లొకేషన్లు, బడ్జెట్స్ ఇలాంటివేమీ చూడడం లేదు. కథ ఉందా..? దాన్ని ప్రేక్షకుడుకు ఒక దర్శకుడు అర్థమయ్యేలా చెప్పగల్గుతున్నాడా..? ఇదే చూస్తున్నారు, అందుకే ఏ మధ్యకాలంలో బడ్జెట్ ఎక్కువ ఉన్న సినిమాలు కన్నా కథ ఉన్న చిన్న సినిమాలు ఎక్కువ హిట్ అందుకుంటున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ అందుకున్న సినిమాలను ఇప్పటి ప్రేక్షకుల కోసం 4k లో రీ రిలీజ్ లు చేస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజులు, స్పెషల్ డేస్ కు థియేటర్స్ లో స్పెషల్ షోస్ వేసి మేకర్స్ లాభాలను అందుకుంటున్నారు. అయితే అప్పటి హిట్ సినిమాలు అయినా కొంతమంది చూస్తున్నారు.. ఇంకొంతమంది మాత్రం ఇప్పటివరకు చూసినవే కదా అని లైట్ తీసుకుంటున్నారు.

Adi Pinisetty: లైలా… ఈసారి ఏ మేరకు ‘శబ్దం’ చేస్తుందో!?

ఇంకా నిజం మాట్లాడుకోవాలంటే.. కొత్త ఒక వింత.. పాత ఒక రోత లాగా.. ఈ ట్రెండ్ కూడా పాత పడిపోయింది. కొత్తలో ఒక నాలుగు సినిమాలకు మాత్రమే అభిమానులు హైప్ తెచ్చారు. మిగతా సినిమాలు ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కూడా తెలియదు. అంతెందుకు.. మొన్నా మధ్య చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ చేశారు. చిరు సినిమా అనేసరికి థియేటర్ లు రచ్చ లేస్తాయి అనుకున్నారు. కానీ, దానికంత హైప్ లేదు. ఇక హిట్ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే.. ఒక అట్టర్ ప్లాప్ ను రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేశారు. అదే ఆంధ్రావాలా. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా గుర్తింపు తెచ్చుకుంది.

Samantha: టీమ్ లో అమ్మాయిలు లేరా.. లేక సామ్ కన్నా గొప్పవారు లేరా..?

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయం పాలైంది. ఇక ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ ను ఇప్పటికి ఎన్టీఆర్ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈసినిమా ను ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికికారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అప్పట్లో ఎటువంటి కారణాల వలన ప్లాప్ అయ్యిందో తెలియకపోవచ్చు. అందుకే ఆంధ్రావాలా మరోసారి తన లక్ ను చూసుకోవడానికి రీ రిలీజ్ అవుతుందా అన్నట్లు ఉంది.ఈ నెలలోనే ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. మరి ఈసారి ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను ఏమైనా హిట్ అయ్యేలా చూస్తారేమో చూడాలి.

Show comments