NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. సినిమా లేకపోతే ఇల్లు. తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి. అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె ఎప్పుడు, ఏ వేడుకలో బయట కనిపించి ఎరుగదు. ఎంతో నిదానస్తురాలు. తారక్ పక్కన తప్ప ఏనాడు బయట ఒంటరిగా కనిపించింది లేదు. ఎన్టీఆర్ ను వివాహం చేసుకొనే సమయానికి లక్ష్మీ ప్రణతికి దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు నచ్చానా..? లేదా ..? అని ఆమెను అడిగినట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ అంటే ప్రణతికి ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక నందమూరి ఇంట ఫంక్షన్ జరిగినా, లేదా ఎన్టీఆర్ తో బయటికి వచ్చినా ప్రణతి ఎంతో సింపుల్ గా వస్తుంది. డిజైనర్ డ్రెస్ లు, హంగులు, ఆర్భాటాలు, నగలు ఇవేమి కనిపించవు. అందుకే ఆమె సింప్లిసిటీగా అందరూ ఫిదా అవుతారు. అయితే తాజాగా నాత్ర భార్య ప్రణతి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ తల్లితో పాటు ప్రణతి ఆ ఫంక్షన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగందం ఉట్టిపడేలా.. సాక్షాత్తు మహాలక్ష్మీ కిందకు దిగివచ్చిందా అన్నట్లు ప్రణతి చీరకట్టుతో ఒంటి నిండా నగలతో కనిపించింది. బ్లూ కలర్ పట్టుచీరపై వజ్రాల ఆభరణాలను పెట్టుకొని నిండుగా పూలు పెట్టుకొని లక్ష్మీ దేవిలా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎంతోమంది హీరోల భార్యలను చూశాం కానీ ఇలాంటి భార్యను చూడలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
