NTV Telugu Site icon

Charan NTR: ఈ ట్వీట్ కోసం కదా ఇంతసేపు వెయిట్ చేసింది…

Charan Ntr

Charan Ntr

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలయ్యయో, ఎన్ని అవార్డులు వచ్చాయో, ఇండియన్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక సినిమాలో నటించడం అనేది చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చరణ్-ఎన్టీఆర్ లు కలిసి సినిమా చెయ్యడం అనేది బిగ్గెస్ట్ రిస్క్. ఆ రిస్క్ ని చరణ్, ఎన్టీఆర్ లు ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా చెయ్యడానికి కారణం ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే. చరణ్, ఎన్టీఆర్ లు చాలా మంచి ఫ్రెండ్స్, ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా ముందు నుంచే మంచి స్నేహితులు కాబట్టి ఆ బాడింగ్ తెరపైన, ప్రమోషన్స్ లో కనిపించింది. ఇద్దరు టాప్ హీరోలు ఇంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే రేంజులో చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించారు. అయితే ఇదంతా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం మాత్రమే అని కామెంట్స్ చేసే వర్గానికి చెందిన ఆడియన్స్ కూడా ఉన్నారు.

ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా చరణ్, ఎన్టీఆర్ లు మాత్రం ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని గ్లోబల్ స్టేజ్ లో నిలబెట్టారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయి, ఇకపై చరణ్-ఎన్టీఆర్ లు కలిసి కనిపిస్తారా లేదా అనే ఆలోచన మెగా నందమూరి అభిమానులతో సినీ అభిమానులందరిలోనూ ఉంది. అందుకే రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన ఈ రోజున ఎన్టీఆర్ నుంచి ట్వీట్ వస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎన్టీఆర్, చరణ్ కి ఎప్పుడు విష్ చేస్తాడా అని వెయిట్ చేసిన మ్యూచువల్ ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ఎన్టీఆర్ “హ్యాపీ బర్త్ డే మై బ్రదర్, హ్యావ్ ఏ బ్లాస్ట్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుత మెగా నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ ని రీట్వీట్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ తో పాటు చరణ్ తో ఉన్న ఒక ఫోటోని కూడా పోస్ట్ చేసి ఉంటే ఇంటర్నెట్ అంతా షేక్ అయ్యేది.

Show comments