Site icon NTV Telugu

NTR: తారక్ గొప్ప మనసు.. అభిమాని చావుబతుకుల మధ్య ఉంటే..

Ntr

Ntr

నందమూరి కుటుంబం గురించి, వారి చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబ రక్తంలోనే సేవ చేసే గుణం ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ప్రతి ఒక్కరూ ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నవారే.. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు కష్టం వస్తే అస్సలు ఓర్చుకోలేడు.. ఈ విషయం అందరికి తెల్సిందే.. తన ప్రతి ఈవెంట్ చివరిలో అభిమానులందరికి జాగ్రత్తలు చెప్పే పంపిస్తాడు. అంత గొప్ప మనసున్న ఎన్టీఆర్ మరోసారి తన ఉదారతను చూపించాడు.

తన అభిమాని చావుబతుకుల మధ్య ఉన్న విషయం తెలుసుకొని అతడిని పరామర్శించడమే కాకుండా తాను ఉన్నానని దైర్యం చెప్పాడు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని.. ఇటీవలే అతనికి యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన చివరి కోరికగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో మాట్లాడిస్తే బిడ్డ ఆనందిస్తాడని తెలుసుకున్న తల్లి ఒక వీడియో ద్వారా కొడుకు కోరికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మిత్రులు.. నందమూరి కుటుంబ అభిమాని చిట్టివేలు సుకుమార్ రాయల్ కు తెలియజేశారు. వెంటనే ఆయన ఎన్టీఆర్ మేనేజర్ సందీప్ మరియు మరియు పిఆర్ఓ మాణిక్యం తో మాట్లాడి ఎన్టీఆర్ కు విషయాన్ని చేరవేశారు. ఇక విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే తన అభిమానికి ఫోన్ చేసి దైర్యం చెప్పారు. అతడు కోమాలో ఉన్నాడని తెలుసుకున్న ఎన్టీఆర్ నీకేమి కాదని, నీకు, నీ కుటుంబానికి అండగా నేను ఉంటాను అని ఎన్టీఆర్ దైర్యం చెప్పారు. అంతేకాకుండా ఆసుపత్రి ఖర్చులకు సహాయం కూడా చేస్తానని కుటుంబానికి హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ను ప్రశంసిస్తున్నారు.

Exit mobile version