NTV Telugu Site icon

MAD Trailer: ఫ్రెండ్స్ మీరు లేకపోతే… నా లైఫ్ ఇంకా మంచిగుండేది… ఈ ట్రైలర్అంతా యూత్ స్టఫ్

Mad Trailer

Mad Trailer

జాతిరత్నాలు సినిమాని తెలుగు ఆడియన్స్ థియేటర్స్ లో విపరీతంగా ఆదరించారు. యూత్ రిపీట్ మోడ్ లో చూసి నవ్వుకున్నా జాతిరత్నాలు సినిమా కన్నా మ్యాడ్ సినిమా చూస్తే ఎక్కువ నవ్వుతారు. ఒకవేళ జాతిరత్నాలు సినిమా కన్నా ఒక్క ప్లేస్ లో అయినా తక్కువ నవ్వాము అని మీకు అనిపిస్తే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. మ్యాడ్ మూవీ టీజర్ నచ్చిన వాళ్లకి నాగ వంశీ ఇచ్చిన స్టేట్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించదు. సినిమా సూపర్ ఉంటుందేమో అనిపిస్తుంది, ఇప్పుడు ఆ మాటని మరోసారి ప్రూవ్ చేస్తూ మ్యాడ్ ట్రైలర్ బయటకి వచ్చింది. ఫుల్ ఆన్ ఫన్ ఉన్న మ్యాడ్ ట్రైలర్ యూత్ టార్గెట్ గా నవ్విస్తూనే ఉంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసాడు.

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న మ్యాడ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో గుండు ఉన్న వ్యక్తిని దువ్వెన అడగడం… ఫ్రెండ్స్ మీరు లేకపోతే అని ఎమోషనల్ గా స్టార్ట్ అయిన డైలాగ్, నా లైఫ్ ఇంకా మంచిగుండేది అనే కామెడీ టర్న్ తీసుకోవడం… ఏం చిల్లరగాళ్లురా అనే డైలాగ్ ట్రైలర్ లో బాగా పేలాయి. ట్రైలర్ తో హైప్ పెరిగింది కాబట్టి ఈ మూడు రోజులు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే… ఒక హ్యాపీ డేస్, ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్ మూవీ అనే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం గ్యారెంటీ. మరి అక్టోబర్ 6న మ్యాడ్ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Show comments