Site icon NTV Telugu

Virupaksha: మెగా హీరో సినిమాని సపోర్ట్ చేస్తున్న ‘టైగర్’ ఫాన్స్…

Virupaksha

Virupaksha

మెగా నందమూరి ఫ్యామిలీస్ మధ్య కొన్ని దశాబ్దాలుగా ప్రొఫెషనల్ వార్ జరుగుతూనే ఉంది. ఫాన్స్ మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అనే ఫ్యాన్ వార్ తరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించి ఆ ఫ్యాన్ వార్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అనుకుంటే అవి ఇంకాస్త పెరిగాయి. ప్రతిరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంది. దీనికి అతీతమైన మెగా హీరో, నందమూరి హీరోలతో మంచి రిలేషన్స్ మైంటైన్ చేసే హీరో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మెగా హీరోకి నందమూరి హీరోలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లతో మంచిస్నేహం ఉన్న సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆర్ తో ఇంకా క్లోజ్ రిలేషన్ మైంటైన్ చేస్తాడు.

తన సినిమాల ఓపెనింగ్స్ కి, ప్రమోషన్స్ ని కూడా నందమూరి హీరోలతో చేయించడం తేజ్ కి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అందుకే నందమూరి అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్ ని మిగిలిన మెగా హీరోల్లా కాకుండా కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. సాయి ధరమ్ తేజ్ సినిమా వస్తుంది అంటే సపోర్ట్ చేస్తారు, అలానే ఇప్పుడు కూడా తేజ్ నటించిన ‘విరుపాక్ష’ సినిమాకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో విరుపాక్ష సినిమాకి ఎన్టీఆర్ ఫాన్స్ మరింత అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ వాయిస్ వినడానికి ఫాన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. దీని కారణంగా విరుపాక్ష సినిమాకి అటు మెగా ఫాన్స్ ఇటు నందమూరి ఫాన్స్ బ్యాక్ అప్ దొరికేసింది. మరి మార్నింగ్ షోస్ తో హిట్ టాక్ రాబట్టిన తేజ్, ఫస్ట్ వీకెండ్ కి ఎంత కలెక్ట్ చేస్తాడు అనేది చూడాలి.

Exit mobile version