స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 ఆగిపోయిందని రామ్ చరణ్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ మొదలు పెట్టారు శంకర్. దిల్ రాజు నిర్మాణంలో గ్రాండ్‌గా మొదలైన ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఇండియన్ 2 మళ్లీ లైన్లోకి వచ్చేసింది. విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న కమల్ హాసన్… అదే జోష్‌లో శంకర్‌తో పట్టుబట్టి మరీ ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టేలా చేశాడు. దాంతో రెండు సినిమాలను ఈక్వల్‌గా షూటింగ్ చేస్తున్నాడు శంకర్. బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఛేంజర్, ఇండియన్2 షూటింగ్ చేస్తున్నాడు. అయినా కూడా గేమ్ ఛేంజర్ అనుకున్న సమయానికంటే… డిలే అవుతూ వస్తోంది. అందుకే ఈ సినిమా కోసం హిట్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. అసలు… శంకర్ సినిమాని వేరే వాళ్ళు దర్శకత్వం వహించడం ఏంటి అనేదే ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఈ లోపు హిట్ ఫ్రాచైంజ్‌తో హిట్స్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలనుతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. లీడ్ క్యారెక్టర్స్ లేని, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లతో ఈ సీన్స్ తీసారని సమాచారం. వన్స్ రామ్ చరణ్ ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయితే రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు శంకర్. ఈ మధ్య చరణ్‌కు కూతురు పుట్టడంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ సినిమాకు నిజంగానే… హిట్ డైరెక్టర్ డైరెక్షన్ చేశాడా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వెంకటేష్‌తో ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు శైలేష్ కాబట్టి… ఇలాంటి విషయాల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
