NTV Telugu Site icon

Music Director: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 28 ఏళ్ళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..

Ntv Breaking News

Ntv Breaking News

Young Music Composer Praveen Kumar passes away at 28 Years: సెలబ్రిటీల జీవితంలో ఏదైనా విషాదం జరిగితే వారి అభిమానులు తట్టుకోలేరు. ఐతే ఇప్పుడు ఓ సెలబ్రిటీ మరణవార్త అందరినీ కలిచివేసింది. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో ఒమంతురార్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు. సినీ పరిశ్రమలో యువ సంగీత స్వరకర్తగా రాణిస్తున్న ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించిన వారెవరూ అంత తేలిగ్గా ఆ స్థాయికి చేరుకోలేరు. ప్రవీణ్ కుమార్ ఎన్నో సవాళ్లను అధిగమించి తమిళ చిత్రసీమలో సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు.

Actress Sridevi: వారికి శ్రీదేవి ఇంట్లో గడిపే అవకాశం?

రాకతాన్, మేడకు లాంటి హిట్ సినిమాలకి సంగీతాన్ని అందించిన ప్రవీణ్ కుమార్ సంగీతాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూస్తారు. అయితే అలాంటి ప్రవీణ్ కుమార్ ఈ రోజు మరణించారు. ప్రవీణ్ కుమార్ గత కొన్ని వారాలుగా ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన స్వగ్రామం తంజావూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ 28 ఏళ్ల వయస్సులో మరణించడం సినీ పరిశ్రమ మరియు కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రవీణ్ మొత్తం మీద రాకథాన్, మెడకు 2, కక్కన్, బంపర్, రాయర్ పరంపరై వంటి చిత్రాలకు సంగీతం అందించారు.