Site icon NTV Telugu

NTR: అదుర్స్ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసిన మాస్ కా దాస్

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి హీరో. ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏది అనగానే ప్రతి ఒక్కరి నుంచి యునానిమస్ గా వినిపించే పేరు ‘అదుర్స్’ మూవీ. ఎన్టీఆర్ తో ఆది, సాంబ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన వినాయక్, ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో కామెడీ చేయించాడు. ఎన్టీఆర్ సీరియస్ రోల్స్ మాత్రమే కాదు ఏ రోల్ ని అయినా అద్భుతంగా చెయ్యగల కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసింది అదుర్స్ సినిమా. 2010 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

నిజానికి అదుర్స్ మూవీలో అంత గొప్ప కథేమి ఉండదు, దాన్ని అంత గొప్పగా మార్చింది ఎన్టీఆర్ నటన మాత్రమే. ఎన్టీఆర్ ని చూసి మీసాలు తిప్పే వాళ్లు కూడా నవ్వుకున్నారు అంటే అదుర్స్ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు కానీ చారీ క్యారెక్టర్ లో అద్భుతమే చేసి చూపించాడు. బ్రహ్మీతో, బ్రహ్మికి పోటీగా ఎన్టీఆర్ చారీ పాత్రలో చేసిన కామెడీ సూపర్బ్ ఉంటుంది. ఈ రోల్ లో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆల్ టైం బెస్ట్ గా ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ కి చేంజ్ ఓవర్ ప్రాజెక్ట్ గా నిలిచిన అదుర్స్ సినిమా నవంబర్ 18న రీరిలీజ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అదుర్స్ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదుర్స్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్లకి కూడా అదుర్స్ సినిమా నచ్చుతుంది కాబట్టి నవంబర్ 18న రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయేమో చూడాలి.

Exit mobile version