NTV Telugu Site icon

Ugram: నరేష్ కోసం వీళ్లు ఇంత చేస్తారు అనుకోలేదు…

Ugram

Ugram

అల్లరి నరేష్ అనే బ్రాండ్ నుంచి ‘అల్లరి’ని తీసేసి కొత్త నరేష్ ని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాడు నరేష్. తనకంటూ న్యూ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటున్న నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నరేష్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రామిసింగ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉగ్రం మూవీ మే 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్న ఉగ్రం సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ గ్రాండ్ స్కేల్ లో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చేశారు. యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, అడవి శేష్, సందీప్ కిషన్, నిఖిల్ చీఫ్ గెస్టులుగా వచ్చి ఉగ్రం సినిమాని ప్రమోట్ చేశారు. అల్లరి నరేష్ ని ఉగ్రం సినిమా చూసిన తర్వాత యాంగ్రీ నరేష్ అంటారు అనే రేంజులో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నలుగురు హీరోలూ ఉగ్రం సినిమాపై పాజిటివ్ గా మాట్లాడడంతో ఈ హీరోల ఫాన్స్ కూడా ఉగ్రం సినిమాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, అడవి శేష్ లు ఇక్కడితో ఆగలేదు. నరేష్ ఎలా అయినా హిట్ కొట్టాలి, ఉగ్రం సినిమాకి మ్యాగ్జిమమ్ బజ్ ని జనరేట్ చెయ్యాలి అంటే ఈ యంగ్ హీరోలు ప్రస్తుతం ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న డైలాగ్స్ ని రీల్స్ కూడా చేశారు. నాలుగు హీరోలూ నాలుగు వేరు వేరు డైలాగ్స్ తీసుకోని చేసిన రీల్స్ ని షైన్ స్క్రీన్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక హీరో సినిమా రిలీజ్ సమయంలో ఇంకో హీరో ఆల్ ది బెస్ట్ చెప్పడం గొప్ప అవుతున్న టైంలో… అడవి శేష్, విశ్వక్ సేన్, నిఖిల్, సందీప్ కిషన్ లు రీల్స్ చేసి మరీ ఉగ్రం సినిమాని, నరేష్ ని సపోర్ట్ చెయ్యడం గ్రేట్ అనే చెప్పాలి. మరి ఇంతమంది సపోర్ట్ ని సొంతం చేసుకున్న నరేష్, ఉగ్రం సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Show comments