Site icon NTV Telugu

వివాహ బంధంలోకి యువ దర్శకుడు శివకుమార్!

siva-kumar

ప్రముఖ దర్శకురాలు స్వర్గీయ బి. జయ, స్టార్ పీఆర్వో, నిర్మాత, సూపర్ హిట్ పత్రిక అధినేత, స్వర్గీయ బి.ఎ.రాజు తనయుడు, యువ దర్శకుడు శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శివకుమార్ పుట్టిన రోజు 22. దాంతో అతనికి ఆ సంఖ్య పట్ల అపారమైన ఇష్టం ఏర్పడింది. అందుకే తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also : లక్ అనేదే లేదు… ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

ఇదిలా ఉంటే… తనకు అచ్చి వచ్చిన 22వ తేదీన శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. 2022 సంవత్సరం, జనవరి 22వ తేదీ 22 గంటలకు తన స్నేహితురాలు దండిగె లావణ్య మెడలో శివకుమార్ మూడు ముడులూ వేశాడు. పూణేలో పుట్టి పెరిగిన లావణ్య మరాఠీ వనిత. హైదరాబాద్ లో ఆమె కుటుంబం స్థిరపడింది. లావణ్యతో తన స్నేహాన్ని వివాహబంధంగా మార్చుకున్నానని శివకుమార్ తెలిపాడు. నిరాడంబరంగా జరిగిన ఈ రిజిస్టర్ మ్యారేజ్ సమాచారాన్ని శివకుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియచేయడంతో, సినిమా రంగానికి, జర్నలిజానికి చెందిన హితులు, సన్నిహితులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.

Exit mobile version