Site icon NTV Telugu

‘సీతా మనోహర శ్రీ రాఘవ’తో విరాట్ రాజ్ గ్రాండ్ ఎంట్రీ

Yesteryear actor Haranath’s grandson Virat Raj Introduction

మరో ప్రతిభావంతుడైన యువకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నటుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా టాలీవుడ్ లోకి డ్రాను ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. “కోడె నాగు”, “భక్త తుకారాం” మరియు “రిక్షా రాజి” వంటి విజయాలలో వెంకట సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. వందన మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న “సీతా మనోహర శ్రీ రాఘవ” చిత్రంలో విరాట్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Read Also : నీకేంటి నొప్పి… వైరల్ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ దుర్గా శ్రీవత్ససా కె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్ ఇండియన్ మూవీ “కేజిఎఫ్-2″కు, యంగ్ రెబల్ స్టార్ ‘సలార్’ మూవీకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. కాగా ఈరోజు విరాట్ పుట్టినరోజు సందర్భంగా నట గురువు శ్రీ సత్యానంద్ ‘సీతా మనోహర శ్రీ రాఘవ’ సినిమా పోస్టర్, వీడియోలను రిలీజ్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

Exit mobile version