Site icon NTV Telugu

శ్రీదేవి మేనకోడలు, శివాజీ మనవడుతో మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం’

yedalo mounam

yedalo mounam

పలు పురస్కారాలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దివంగత నటి, భరతనాట్య కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం’. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇందులో ఇంకా విఘ్నేష్ శివసుబ్రమణియన్, వేస్త చెన్ ఇతర తారాగణం. కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరపరిచిన బాణీతో ఈ మ్యూజిక్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు.

సూర్య హీరోగా నటించిన ‘బందోబస్తు’కు సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాటకు ఆంటోనీ గొంజాల్వెజ్ ఎడిటర్. ఆయన దర్శకులు శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకు పని చేశారు. ఆస్కార్ పురస్కారాల్లో ‘లైఫ్ యాక్షన్ షార్ట్’ కేటగిరీలో పోటీ పడుతున్న ‘వెన్ ద మ్యూజిక్ చేంజెస్’ తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది. ఇప్పుడు ఐ ట్యూన్స్, ఆదిత్య మ్యూజిక్ ఛానళ్లలో ‘వెన్ ద మ్యూజిక్ ఛేంజెస్’ అందుబాటులో ఉంది.

Exit mobile version