NTV Telugu Site icon

Eagle: ఈగల్ కి పోటీ తప్పట్లేదు!

Raviteja Eagle

Raviteja Eagle

Yatra 2 and Ooeru peru bhairava Kona to competete with eagle movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ వెల్లడించారు. ఫిబ్రవరి 9న ‘ఈగల్‌’ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ‘మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం. రావడంలో కొద్ది మార్పు, షాట్ & టార్గెట్ లో కాదు💥#ఈగల్ ఫిబ్రవరి 9, 2024 నుంచి” అని మాస్ మహారాజా రవితేజ ట్వీట్ చేశారు ‘ఈగల్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ను తెలియజేస్తూ..’బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్‌’ను ఫిబ్రవరికి తీసుకొచ్చాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్‌ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్‌ కాదు’’ అని ఓ పోస్ట్ లో తెలియజేశారు మేకర్స్.

Guntur Kaaram: మమ్మల్ని క్షమించండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం లేదు

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటిస్తుండగా.. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పండుగ నుంచి వెనక్కి వెళ్లినందుకు సోలో రిలీజ్ చేసుకునేలా అవకాశం కల్పిస్తామని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఫిబ్రవరి 9న రావాల్సిన టిల్లు స్క్వేర్ సినిమా తప్ప మరే ఇతర సినిమాలు వాయిదా పడలేదు. ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న ఊరు పేరుభైరవ కోన రిలీజ్ అవుతున్నాయి. యాత్ర 2 టీమ్ ఇతర సినిమాలు ప్రకటించక ముందే తేదీని ప్రకటించింది. యాత్ర 2 డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను కూడా లాక్ చేసారు. అలాగే ఈగల్ కి సోలో డేట్ ఇస్తున్నప్పుడు దిల్ రాజు అండ్ టీమ్ వారిని సంప్రదించలేదని తెలుస్తోంది. యాత్ర 2 టీమ్ 100% ఫిబ్రవరి 9న వస్తోందని చెప్పారు. #ఊరు పేరు భైరవకోన నిర్మాతలను దిల్ రాజు టీమ్ కూడా అడగలేదని ఈ సినిమా కోసం భారీ వడ్డీలు చెల్లిస్తుండటంతో ఇప్పుడు అడిగినా వెనక్కి వెళ్ళడానికి నిర్మాతలు నో చెప్పారని అంటునాన్రు. జనవరి 12న సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేస్తున్న నాగ వంశీ కారణంగా Tillu Square మాత్రమే వాయిదా వేయబడిందని తెలుస్తోంది.