Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ హీరోగా ‘యథా రాజా తధా ప్రజా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా ‘యథా రాజా తధా ప్రజా’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా నటిస్తున్నాడు. శ్రష్టి వర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇవ్వగా, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ”హరీష్ పటేల్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. కథ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో జానీ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పగా… కీలక అంశం నచ్చి ఓకే చేశారు. రాజకీయ వార్తలు అంటే గతంలో పది నిముషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశం అయ్యింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో సందేశంతో పాటి వాణిజ్య హంగులు అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రధన్ గారు అద్భుతమైన బాణీలు అందించారు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వస్తుంది” అని అన్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?


జానీ మాస్టర్ మాట్లాడుతూ ”చిరంజీవి గారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే… శ్రీనివాస్ గారు చెప్పిన కథ వినగానే నచ్చింది. జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బావుంటుందని నిర్ణయం తీసుకున్నాను. ‘సినిమా బండి’ చూశా. వికాస్ బాగా చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. ‘యథా రాజా తధా ప్రజా’ టైటిల్ ఐడియా మాకు ఇచ్చింది రైటర్ నరేష్ గారు. ఆయనకు థాంక్స్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం మా సినిమాకు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థాంక్స్. నన్ను, మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించటానికి వచ్చిన శర్వానంద్ గారు, ఆయుష్ వర్మ గారికి థాంక్స్. నిన్నే ఆయుష్ శర్మతో ఒక సాంగ్ కంప్లీట్ చేశాం” అని అన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ స్నేహితులు గణేష్ మాస్టర్ మాట్లాడుతూ ”ఆల్ ది బెస్ట్ టు ‘యథా రాజా తధా ప్రజా’ టీమ్. సినిమా పెద్ద హిట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. మా బ్రదర్ జానీకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక – నిర్మాతలకు థాంక్స్. మ్యూజిక్ పరంగా దుమ్ము లేచిపోతుంది. అందులో డౌట్ లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మంచి కథతో సినిమా రూపొందుతోంది” అని అన్నారు. సంగీత దర్శకుడు రధన్ మాట్లాడుతూ ”సంగీతానికి న్యాయం జరగాలంటే మంచి మాస్టర్ ఉండాలి. మా సినిమాలో మాస్టారే హీరో. మా టీమ్ అంతా నాకు మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి పాటలు అందించడానికి ఆస్కారం లభించింది” అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ సునోజ్ వేలాయుధన్ మాట్లాడుతూ ”మాది కేరళ. ఏడెనిమిది నెలల క్రితం జానీ గారిని కలిశా. అప్పుడు ఆయన ఈ సినిమా కథ గురించి చెప్పారు. హైదరాబాద్ వచ్చి శ్రీనివాస్ విట్టల గారిని కలిసినప్పుడు కథను పూర్తిగా వివరించారు. బాగా నచ్చింది. మేమంతా టీమ్ గా వర్క్ చేస్తున్నాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!