TOXIC : టాక్సిక్ టాక్‌ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?

Toxic Day 1

Toxic Day 1

యష్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్‌’ మూవీ.. ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ మొదలైంది. కానీ, కెజీయఫ్‌తో యష్‌కు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్.. టాక్సిక్‌కు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 140 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియావ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా… రూ.101 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

ఇందులో అత్యధిక వాటా హిందీ వెర్షన్ నుంచి వచ్చినట్టుగా టాక్. ఫస్ట్ డే హిందీ వెర్షన్ ద్వారా రూ.55 కోట్ల కలెక్షన్స్ నమోదు కాగా… కన్నడ వెర్షన్‌లో రూ.25 కోట్ల లోపే వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్‌లో రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. మిక్డ్స్ టాక్‌తో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషం. కానీ ఈ టాక్ కారణంగా రాబోయే రోజుల్లో కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రీ-సేల్‌ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో, తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు సృష్టించింది. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో మొదటి రోజు దాదాపు 9,05,000 పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో సింగిల్ డే సేల్స్‌లో ఇది సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి వారు కీలక పాత్రల్లో నటించగా రవి బస్రూర్ సంగీతం అందించారు.

Note : ఈ కలెక్షన్స్ అధికారక నంబర్స్ కాదు..