Toxic Advance Booking: ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిన యష్ మరోసారి ‘టాక్సిక్’తో భారీ బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన చిత్రబృందం ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో అభిమానులు థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం సిద్ధమవుతున్నారు. ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ 2026 ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌తో ప్రకటించారు. రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో యష్ రగ్గడ్, ఫియర్స్ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో విడుదల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ నుంచి విడుదలైన కొన్ని సన్నివేశాలు విజువల్ స్టైల్, యాక్షన్ డిజైన్, సినిమాటిక్ స్కేల్ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన డార్క్ విజువల్ వరల్డ్ సినిమాకు భిన్నమైన గుర్తింపును తీసుకొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ‘టాక్సిక్’లో యష్‌కు తోడుగా భారీ తారాగణం కనిపించనుంది. నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కూడా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాత్రలే కథకు హైలెట్ గా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాపై హైప్ పెరగడానికి మరో ప్రధాన కారణం యష్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారనే ప్రచారం. ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని వస్తున్న సమాచారం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆయన కొత్త అవతారం చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడానికి కొంత సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఆగస్టు 21 నుంచి టికెట్ అమ్మకాలు ప్రారంభం కానుండగా, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘టాక్సిక్’ సందడి చేయనుంది. మరి యష్ ఈ సినిమాతో మరోసారి ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారో చూడాల్సి ఉంది.

