Site icon NTV Telugu

Toxic Director:అల్లు అర్జున్ సినిమాకి వర్క్ చేసిన టాక్సిక్ డైరెక్టర్ భర్త.. ఎవరో తెలుసా?

Geetu Mohan Das

Geetu Mohan Das

కన్నడ స్టార్ యష్ తదుపరి మూవీ టాక్సిక్’ (Toxic)పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న యష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన రెండు నిమిషాల స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇది ‘హాలీవుడ్ రేంజ్’లో ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ గ్లింప్స్‌లో శృంగార సీన్ చూపించడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మేకింగ్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న గీతు మోహన్ దాస్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు సినిమా ప్రేమికులు.

Also Read :The Raja Saab: రాజాసాబ్ థియేటర్‌లో మంటలు

గీతు మోహన్ దాస్ మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు. గీతు మోహన్ దాస్ భర్త మరెవరో కాదు, ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఆయన అద్భుతమైన విజువల్స్ అందించడంలో దిట్ట.రాజీవ్ రవి గతంలో అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే గత ఏడాది విడుదలైన ‘ఒక పథకం ప్రకారం’ చిత్రానికి కూడా ఆయనే కెమెరామెన్. గీతు మోహన్ దాస్ కేవలం కమర్షియల్ దర్శకురాలు మాత్రమే కాదు. ఆమె తీసిన ‘లయర్ డైస్’ (Liar’s Dice) వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఒక రేంజ్‌లో ఉన్న మాట వాస్తవం. గీతు మోహన్ దాస్ ఎంచుకున్న కలర్ ప్యాలెట్ మరియు యాక్షన్ కొరియోగ్రఫీ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపిస్తోంది. ‘టాక్సిక్’ వీడియోతో గీతు మోహన్ దాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

Exit mobile version