కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని చూపిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్, ‘పఠాన్’ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ పఠాన్ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. మరో రెడ్ను రోజుల్లో ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీ ఉంది. మూడు వారాలుగా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న షారుఖ్ అండ్ యష్ రాజ్ ఫిల్మ్స్ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశాయి. హిందిలో పఠాన్ సినిమా 496 కోట్లు రాబట్టి, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో ఉంది. పఠాన్ కన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 సినిమా ఉంది. ఈ మూవీ 511 కోట్లని రాబట్టి 2017 నుంచి టాప్ ప్లేస్ లో ఉంది. పఠాన్ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యాలి అంటే ఈ వీకెండ్ వరకూ థియేటర్స్ ని హోల్డ్ చెయ్యాలి.
Read Also: Pathaan: 1000 కోట్లు… అది షారుఖ్ ఖాన్ కంబ్యాక్ రేంజ్…
హిందీలో కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా సినిమా ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకి వచ్చింది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా థియేటర్స్ లో మార్నింగ్ షోకే వీక్ టాక్ తెచ్చుకోవడంతో, ఆడియన్స్ పఠాన్ సినిమాకే మళ్లీ ఓటు వేస్తునారు, కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి టాప్ ప్లేస్ టార్గెట్ మిస్ అవుతుంది అని అంచనా వేసుకున్నారో ఏమో కానీ ఈరోజు నుంచి గురువారం వరకూ ఇండియాలోని పఠాన్ సినిమా ఆడే ప్రతి థియేటర్ లో టికెట్ ప్రైజ్ ని 110/- చేశారు. పఠాన్ సినిమాని 110/- రూపాయలకి చూసే ఛాన్స్ ఇస్తూ మేకర్స్ పఠాన్ సినిమాని సెలబ్రేట్ చేసుకోండి అని అనౌన్స్ చేశారు. దీంతో సినిమా లవర్స్ పఠాన్ సినిమాని రిపీట్ మోడ్ లో చూడడానికి రెడీ అవుతున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.
