Site icon NTV Telugu

యండమూరి దర్శకత్వంలో ‘అతడు.. ఆమె.. ప్రియుడు’

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహిస్తున్న ‘నల్లంచు తెల్లచీర’ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే ‘అతడు – ఆమె – ప్రియుడు’ మూవీకి శనివారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంలో సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా, మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ క్రేజీ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ (యు.ఎస్.ఏ) సహ నిర్మాతలు.

ముహూర్తపు సన్నివేశానికి ‘మాతృదేవోభవ’ ఫేమ్ అజయ్ కుమార్ క్లాప్ కొట్టగా, నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. యండమూరి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్ల చీర’ అనంతరం వెంటనే ‘అతడు… ఆమె… ప్రియుడు’ చిత్రాన్ని నిర్మించే అవకాశం లభించడం పట్ల నిర్మాతలు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. భూషణ్, జెన్నీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా & ఎడిటింగ్: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్ చల్లపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.

Exit mobile version