నటి యామీ గౌతమ్ ఇటీవలే దర్శకుడు ఆదిత్య ధర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో యామీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినిమా మొత్తం యామీ పాత్రపైనే ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
కాగా, యామీ ఈరోజు మరోన్యూస్ తోను వార్తల్లో నిలిచింది. మనీ లాండరింగ్ కేసులో ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేశారు. జూలై 7న యామీపై దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.
జర్నలిస్ట్ పాత్రలో యామీ గౌతమ్
