Site icon NTV Telugu

Thamasur : ‘థామసూర్‌’లో యామీ – అదా కాంబినేషన్‌.. హారర్‌కి హాట్ టచ్‌!”

Thamasur Movie, Yami Gautam Adah Sharma,

Thamasur Movie, Yami Gautam Adah Sharma,

బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్‌ సిద్ధమవుతోంది. యామీ గౌతమ్‌, అదా శర్మ ఇద్దరూ కలిసి ఓ హారర్‌ సినిమాలో నటించబోతున్నారని తాజా సమాచారం. ‘ఓఎమ్‌జీ 2’, ‘ధూమ్‌ధామ్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్‌ ప్రస్తుతం ‘హక్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ‘ది కేరళ స్టోరీ’తో పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ కొట్టిన అదా శర్మ ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. ఇక యాక్టింగ్ పరంగా ఈ ఇద్దరు ప్రతిభావంతులైన నటీమణులనే విషయం తెలిసిందే. అలాంటిది ఇద్దరు కలిసి తెరను పంచుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Also Read : Deepika- Alia: దీపికా ఔట్.. అలియా ఇన్ !

వీరిద్దరూ నటించే ఈ కొత్త హారర్‌ సినిమాకు ‘థామసూర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. పౌరాణిక కథా నేపథ్యంతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ఉత్కంఠభరితమైన హారర్‌ అనుభవాన్ని అందించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ధ్వానీల్‌ మెహతా దర్శకత్వం వహించగా, విశాల్‌ రానా నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. హారర్‌తో పాటు గ్లామర్‌ టచ్‌ కూడా ఉండబోతుందట. యామీ, అదా కాంబినేషన్‌ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. ‘థామసూర్‌’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Exit mobile version