దర్శకుడు యదు వంశీ కొత్త వారితో తీసిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ లో హీరోయిన్ కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలోకి ప్రవేశించడానికి ఆశావహులైన నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు.
Also Read : Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా: నిశ్చితార్థం రద్దు చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
ఈ కాస్టింగ్ కాల్‌తో దర్శకుడు కొత్త వారిని కనుగొనడం వైపు దృష్టి సారించారు. ఉత్సాహం, విశ్వాసం, సాంస్కృతిక మూలాల మిశ్రమాన్ని సహజంగా ప్రతిబింబించే “అచ్చమైన తెలుగు అమ్మాయి” కోసం అన్వేషణ జరుగుతోంది. గ్లామర్ కంటే వ్యక్తీకరణ సామర్థ్యం, భావోద్వేగ లోతు, తెలుగు భాషపై ఉన్న పట్టుతో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మన మట్టి కథల్ని చెబుతున్నప్పుడు, ఆ భావాల్ని పండించగలిగే, చూపించగలిగే ఆర్టిస్టులు ఉండాలని యదు వంశీ భావిస్తున్నారు. అందుకే మన తెలుగు వారి కోసమే యదు వంశీ ప్రయత్నిస్తున్నారు. ఆశావహులైన అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను నేరుగా బృందానికి సమర్పించవచ్చు. yadhuvamseeYV2@gmail.com కు ఇమెయిల్ ద్వారా లేదా WhatsApp 8639164104 కు వీడియోలను పంపవచ్చు. ప్రస్తుతం కాస్టింగ్ కాల్ ఆన్‌లోనే ఉంది. ఇక ఎంట్రీలను ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తూనే ఉంటారు.
