NTV Telugu Site icon

Yadama Raju: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే విడాకుల కోసం కొట్టుకున్న జబర్దస్త్ జంట

Yadamma

Yadamma

Yadama Raju: బుల్లితెర కమెడియన్ గా అభిమానుల మనస్సులో మంచి పేరు తెచ్చుకున్నాడు యాదమ్మరాజు. అమాయకుడిగా కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించడంలో యాదమ్మరాజు ముందు ఉంటాడు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక అతని భార్య స్టెల్లా కూడా అందరికి తెలిసిందే. ఒక టీవీ ప్రోగ్రాం లో ఆమెను తీసుకొచ్చి యాదమ్మరాజుకు సర్ ప్రైజ్ ఇవ్వడంతో వీరి ప్రేమ బయటపడింది. ఇక గతేడాది వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. స్టెల్లా.. భర్తపేరుతో ఒక యూట్యూబ్ ను ఓపెన్ చేసి.. షోలు, ఈవెంట్స్ అంటూ తిరుగుతూ బాగానే డబ్బు సంపాదిస్తుంది. ఇక వఈ మధ్యనే వీరు ఒక డ్యాన్స్ షోకు జంటగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట.. తాము విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి షాక్ ఇచ్చారు. అయితే అది ఒరిజిజ్నాల్ గా కాదు కానీ, ఒక షో థీమ్ గా ఈ జంట విడిపోతున్నట్లు తెలిపారు.

WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?

బుల్లితెర కామెడీ షోలో ప్రతి వారం ఒక థీమ్ తో కామెడీ చేస్తూ ఉంటారు. ఇక ఈసారి.. యాదమ్మ రాజు- స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ గా ఉన్నట్లు చూపించారు. నీతో నావల్ల కావడం లేదు .. నాకు విడాకులు కావాలి అని స్టెల్లా అడుగుతుంది. అంతే కాకుండా ఆ విడాకులు కూడా ఒక ఫంక్షన్ లా జరగాలని చెప్పడంతో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని తెలుస్తోంది. అయినా కూడా కొత్త జంట విడాకులు తీసుకోవడం అనేది అంతగా నచ్చలేదని అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఎలాంటి వారిని అయినా కలపడం, విడదీయడం అలవాటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments