Site icon NTV Telugu

F3 Movie: ‘ఊ .. ఆ .. అహ అహ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

F3 Song

F3 Song

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ నుంచి మరో సాంగ్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘ఊ .. ఆ .. అహ అహ’ అంటూ ఈ పాట సాగుతుంది. నీ కోర మీసం చూస్తుంటే.. నువ్వుట్టా తిప్పేస్తుంటే.. అంటూ సాంగ్ ప్రారంభంలో లిరిక్స్ వినిపిస్తున్నాయి. మంచి రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ పాటను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. సునిధి చౌహాన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

కాగా ఎఫ్3 సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌పై నిర్మితమైన ఈ మూవీకి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్, సునీల్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌లో కనిపించి సందడి చేయనుంది. వేసవి కానుకగా ఈ మూవీ మే 27న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version