Site icon NTV Telugu

WITNESS: మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ‘విట్ నెస్’!

Witness1

Witness1

Shraddha Srinath: పారిశుధ్య కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా తెరకెక్కిన చిత్రం ‘విట్ నెస్’. మన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న అత్యంత అమానవీయ పద్ధతుల్లో మాన్యువల్ స్కావెంజింగ్ ఒకటి. కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల ప్రతి సంవత్సరం ఎందరో పేద కార్మికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సమస్య ఆధారంగా తెరకెక్కిన ‘విట్ నెస్’ను సోనీ లివ్ అందిస్తోంది. పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా!
Witness2
ప్రముఖ నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘విట్ నెస్’ కు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అజగం పెరుమాళ్, జి. సెల్వ , రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇదే నెల 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

Exit mobile version