Site icon NTV Telugu

Ekta Sharma: దారుణం.. అవకాశాలు లేక ఆ పని చేస్తున్న నటి

Ekta

Ekta

Ekta Sharma: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎదుగుతారు.. ఎప్పుడు ఎవరు దిగుతారు అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు స్టార్స్ గా వెలుగొందినవారే ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. ఎంతోమంది సినిమాను వదిలి వేరే పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఇంకొంతమంది బయట పనులు చేసుకుంటూనే.. సినిమాపై ఆశ చావక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక నటి.. సినిమాల్లో అవకాశాలు లేక బయట కాల్ సెంటర్ లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే తన దీన స్థితిని చూసి ఆమె కుంగిపోకుండా కష్టపడి పని చేసుకుంటున్నాను.. తప్పేముంది అని దైర్యంగా చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ఏక్తా శర్మ. హిందీలో డాడీ సంజూ కరో, కామిని- దామిని సీరియల్స్ లో నటించి మెప్పించింది ఏక్తా.. ఇక కొన్ని రోజుల క్రితం బెప్నా ప్యార్ షోలోను ఆమె పాల్గొంది. ఇక కరోనాతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన దీన స్థితిని చెప్పుకొచ్చింది.

“కరోనా అందరి జీవితాలను తలక్రిందులు చేసింది.. కరోనా తరువాత నాకు అవకాశాలు తగ్గాయి.. అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. డబ్బుకోసం నగలు కూడా అమ్మేశాను. ఇంకా ఎంత కాలం ఇంట్లో అవకాశాల కోసం ఎదురుచూడాలి. అందుకే ఇల్లు గడవడం కోసం ఒక కాల్ సెంటర్ లో నైట్ వర్కర్ గా జాయిన్ అయ్యాను. ఒక పక్క అక్కడ ఉద్యోగం చేస్తూనే ఉదయం ఆడిషన్స్ కు వెళ్తున్నాను. ఈ పని చేస్తున్నందుకు నేను సిగ్గుపడాల్సింది లేదు.. తప్పు అసలు లేదు. అంతేకాకుండా నా కూతురు కస్టడీ కేసు కోర్టులో నడుస్తోంది. అందుకైనా నాకు డబ్బు కావాలి. అందుకే ఈ పని చేస్తున్నా” అని చెప్పుకొచ్చింది. దీంతో చాలామంది ఈమెను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. సినిమాల్లో అవకాశం రాలేదని ఆత్మహత్య చేసుకొనేవారు.. డబ్బులు లేక వ్యభిచారం చేసేవారు అలాంటి తప్పుడు పనులు మానుకొని నిజాయితీగా ఏ పని చేసుకున్నా ఆత్మగౌరవం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version