NTV Telugu Site icon

Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్

will smith

ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్‌… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా ఉందని చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. జాడా ఎక్కువగా జుట్టు రాలడానికి కారణమయ్యే అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే ఈ జోక్ ను సీరియస్ గా తీసుకున్న విల్ స్మిత్ వేదికపైకి వెళ్లి మరీ క్రిస్‌ చెంప చెళ్లుమన్పించాడు.

Read Also : Krishna Vrinda Vihari : నాగశౌర్య చెప్పిన కొత్త లెక్క 2+2= 22!

ఈ అనూహ్య పరిణామంతో కాసేపు అవార్డ్స్ లైవ్ ఈవెంట్ ఆగిపోయింది. ఆ కాసేపటికే స్మిత్ ఉత్తమ నటుడిగా అదే వేదికపై అవార్డును అందుకున్నాడు. అయితే ఈ షాకింగ్ ఘటనపై అకాడెమీ హింసను ఏ రూపంలోనూ క్షమించదు అని చెప్పుకొచ్చింది. ఇక తండ్రి యాక్షన్ పై స్మిత్ పెద్ద కుమారుడు జాడెన్ స్మిత్ ఇచ్చిన రియాక్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “And That’s How We Do It” అంటూ జాడెన్ స్మిత్ ట్వీట్ చేశాడు. నిజానికి జాడెన్ అందులో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కానీ ఆయన చేసిన ట్వీట్ మాత్రం తన తండ్రి క్రిస్ రాక్‌ను కొట్టడం గురించే అంటున్నారు నెటిజన్లు. కొంతమంది జాడెన్ స్మిత్ కు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం ఈ వివాదంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై హాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారంటే… ?