Sai Pallavi: ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ అతికొద్ది సమయంలోనే లేడీ పవర్ స్టార్ గా మారిపోయింది. అందం, అభినయం, నృత్యం, అణుకువ అన్ని కలగలిపిన రూపం సాయి పల్లవి. పక్కింటి అమ్మాయిలా అన్ని ఇండస్ట్రీలలోను కలిసిపోయింది. ఇటీవలే గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలు ఇంతకుముందు కూడా వచ్చాయి. ఆమె పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలను క్విట్ చేయాలనుకొంటుందని చెప్పుకొచ్చారు. కానీ అందులో నిజం లేదని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా సాయి పల్లవి సినిమాలకు క్విట్ చేయబోతోందని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సాయి పల్లవి తన గత చిత్రాలైన విరాటపర్వం – గార్గి రిలీజైన తర్వాత స్టార్ హీరోల సరసన అనేక ఆఫర్లను తిరస్కరించింది. దీంతో కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఆమె తన కెరీర్ ను సినిమాలు నుంచి ప్రజాసేవలోనే గడపాలని కోరుకుంటున్నదట. సాయి పల్లవి డాక్టర్ అన్న విషయం తెల్సిందే. దీంతో సాయి పల్లవి ఒక ఆసుపత్రిని నిర్మించడానికి సిద్దమైందట .. ప్రస్తుతం ఆ పనుల్లో ఆమె బిజీగా ఉందని, హాస్పిటల్ పనులు పూర్తయ్యేవరకు సినిమాల వైపు కన్నెత్తి చూడదని అంటున్నారు. ఇక హాస్పిటల్ పూర్తీ అయ్యాకా తన సమయాన్ని మొత్తం ఆ హాస్పిటల్ లో ఉండే పేషంట్స్ ను చూసుకోవడానికే వెచ్చిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇది సాయి పల్లవి అభిమానులకే కాదు.. చిత్ర పరిశ్రమకు కూడా చేదువార్తే. ఒక మంచి నటి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడం చాలా బాధాకరమని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
