Site icon NTV Telugu

Mass Maharaja Raviteja: కుర్ర హీరోయిన్లతో రవితేజ లిప్ లాక్స్ ఆపడా..?

Mass Maharaja

Mass Maharaja

Mass Maharaja Raviteja: మాస్ మహారాజా రవితేజ గతేడాది క్రాక్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోతున్న రవితేజ ఈ మధ్యకాలంలో రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ వయస్సు 54.. అయినా ఇప్పటికీ ఫిట్ బాడీతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తాడు. ఇక రవితేజ సినిమా అంటే ఖచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. కథ ఎలా ఉన్నా ఇద్దరు హీరోయిన్లు.. ఐటెం సాంగ్ మస్ట్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవల రవితేజ లిప్ లాక్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొన్నిరోజుల క్రితం వచ్చిన ఖిలాడీ చిత్రంలో మీనాక్షీ చౌదరి పెదాలను అందుకున్న రవితేజ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ లో దివ్యంకా కౌశిక్ పెదవిని చుంబించాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన విషయం విదితమే.

ఇక ఈ ట్రైలర్ లో దివ్యంకా కౌశిక్, రవితేజ లిప్ లాక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వయస్సులో కథకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు చేయాలి కానీ .. ఇలా రొమాన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కథను బట్టే రొమాన్స్ ఉంటుంది. డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడం హీరో బాధ్యత అంటూ రవితేజను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొందరు రవితేజ కథ మీద కొద్దిగా దృష్టి పెడితే బావుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఇక మరోపక్క హీరోయిన్లు ఇలాంటి వాటికి ఎలా ఒప్పుకుంటున్నారు అంటూ మరికొందరు ప్రశ్నిస్తుండగా.. గతంలో మీనాక్షి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ “పాత్ర డిమాండ్ చేసింది కాబట్టే ముద్దు పెట్టాను. డైరెక్టర్ చెప్పిన కథలో ముద్దుకు ఇంపార్టెంట్ ఉంది కాబట్టే ఓకే చేశాను” అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో దివ్యంకాను అడిగినా ఇదే సమాధానం వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా రెడీ గా ఉంటామని ప్రతి హీరోయిన్ చెప్పే విషయమే. ఏదిఏమైనా ప్రస్తుతం రవితేజ లిప్ లాక్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకోనున్నదో చూడాలి.

Exit mobile version