Site icon NTV Telugu

Dasara: రౌడీ హీరో చెయ్యలేనిది… నాని చెయ్యగలడా?

Dasara

Dasara

తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిపొయింది. ఇకపై వీరి నుంచి వచ్చే ఏ సినిమా అయినా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాల్లో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీరి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని, పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో నార్త్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు కానీ కార్తికేయ 2 కలెక్షన్స్ ని నిఖిల్ ఖాతాలో మాత్రమే వెయ్యలేము. అడివి శేష్ ‘మేజర్’ సినిమాతో నార్త్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇది అతనికి పర్మనెంట్ మార్కెట్ గా మారాలి అంటే నెక్స్ట్ చెయ్యబోయే ‘గూఢచారి 2’ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడే అడివి శేష్ పాన్ ఇండియా హీరో అవ్వగలడు. అయితే యంగ్ హీరోల్లో అందరికన్నా ముందు పాన్ ఇండియా హీరో అవుతాడు అనుకున్న విజయ్ దేవరకొండ మాత్రం అందరినీ డిజప్పాయింట్ చేశాడు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు, విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరో కలిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. లైగర్ మూవీ ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ ఆ రేంజులో చేశారు.

తెలుగు నుంచి కొత్త పాన్ ఇండియా హీరో వచ్చేసాడని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయారు. ఆ రేంజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఊహించని ఈ ఫ్లాప్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఎదగలేక పోయాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. రా అండ్ రాస్టిక్ ఎన్విరాన్మేంట్ తో తెరకెక్కించిన దసరా సినిమాతో నాని పాన్ ఇండియా హీరో అవుతాడని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీజర్, ట్రైలర్ లు కూడా దసరా సినిమాపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ ఓడెల తన మేకింగ్ తో దసరా సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో అంచనాలని పెంచేసాడు. మరి ఈ అంచనాలని అందుకోని నాని దసరా సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చి పాన్ ఇండియా హీరో అవుతాడా లేక విజయ్ దేవరకొండలా ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే సినిమా చేశాడా అనేది చూడాలి. ఇప్పటికైతే దసరా సినిమా షూర్ షాట్ హిట్ అని సినీ అభిమానులంతా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నాని ఎంతవరకూ నిలబెడతాడో తెలియాలి అంటే మార్చ్ 30 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version