Site icon NTV Telugu

8Vasantalu : కేరళ కుట్టీ తెలుగులో మెస్మరైజ్ చేస్తుందా.?

8 Vasantalu

8 Vasantalu

మలయాళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో తమ లక్ పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన మరో ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. 15 ఇయర్స్‌కే యాక్టింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టీ. బేసికల్లీ క్లాసిక్ డ్యాన్సర్. యాక్టింగ్ పై ప్యాషన్‌తో నటనవైపు అడుగులేసిన అనంతిక రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మ్యాడ్‌లో నార్నే నితిన్‌కు జోడీగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Also Read : Kubera : కుబేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు.. రికవరీ టార్గెట్ పెద్దదే

కానీ ఆ ఆనందాన్ని మిగల్చేదు తమిళ ఇండస్ట్రీ. కోలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాలు రైడ్, లాల్ సలామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో వచ్చిందే 8 వసంతాలు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 8 వసంతాలు మరికొన్ని గంటల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. పొయోటిక్, ఫీల్ గుడ్ మూవీగా తీసుకు వస్తున్న ఈ సినిమా కథ ఆమె చుట్టూనే తిరుగుతోంది. అయితే కుబేరకు పోటీగా రాబోతుంది. స్టార్ హీరోలకే థియేటర్లకు రావడం కష్టమౌతున్న ఈ టైంలో ఓ ఉమెన్ సెంట్రిక్ అండ్ లవ్ స్టోరీతో వస్తున్నసినిమా కోసం థియేటర్లకు వస్తారా అన్న డౌట్ వస్తోంది. కెరీర్ లో ఇప్పటి వరకు గ్లామర్ షో చేయని భామ టాలీవుడ్‌లో నిలబడాలంటే  ఫీల్ గుడ్ చిత్రాలతో నెట్టుకు వస్తే సరిపోతుందా. ఆమె నటించిన చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కావాలి లేదా. కమర్షియల్ మూవీస్‌లో ఆమె భాగస్వామ్యం కావాలి. అప్పుడే మేడమ్ స్టార్ డమ్ సొంతమవుతుంది. మరి అనంతిక ఆ దిశగా ఆలోచిస్తుందేమో చూద్దాం

Exit mobile version