NTV Telugu Site icon

Sivaji: శివాజీ పెళ్లి లొల్లి.. నాగార్జునతో అలా, హౌస్మేట్స్‌తో మరోలా.. అందుకేనా?

Sivaji In Bigg Boss

Sivaji In Bigg Boss

Why Sivaji Made You turn about his marriage in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరైన హీరో శివాజీ పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై ఒకలా, బిగ్ బాస్ హౌస్ లో ఒకలా మాట్లాడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో కనిపించిన శివాజీ గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్‌తో రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రాజకీయ విశ్లేషకుడిగా కూడా కొన్నాళ్ళు చెలామణీ అయ్యారు. అలాంటి ఆయన బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ రోజు నాగార్జునతో మాట్లాడుతూ తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ.. హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత అక్కడి వారితో తాను సింగిల్ అని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది.

Bigg Boss Sivaji: బీపీనా.. బొక్కా.. నన్ను రెచ్చగొట్టకు బిగ్ బాస్.. నీకన్నా పెద్దవాళ్లనే డీల్ చేశా

అసలు ఎందుకలా చెప్పాడు అంటూ ప్రేక్షకుల్లో పలు సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే నాగార్జున ముందు పెళ్లి అయిందని, మిమ్మల్ని చూసి మా ఆవిడ తిడుతుందని చెప్పిన శివాజీ, ఇప్పుడు సడెన్‌గా మాట ఎందుకు మార్చాడు అని బిగ్ బాస్ ప్రేక్షకులు సందేహ పడుతున్నారు. హౌస్ లోపల టేస్టీ తేజ శివాజీ పెళ్లి గురించి అడగగా తనకు ఎవరూ పిల్లను ఇవ్వలేదని, పెళ్లి కాలేదని చెప్పుకొచ్చాడు శివాజీ. కెమెరాలు చూస్తున్నాయి నిజం చెప్పు అని అడిగినా ఆయన అదే మాట మీద ఉంటానని అన్నారు. కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్‌తో శివాజీ ఇంత పెద్ద అబద్దం ఎందుకు చెప్పారు? ఆయన సరదాగా టేస్టీ తేజను ఆటపట్టించేందుకు అలా చెప్పి ఉంటారా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

Show comments