Samantha And Varun Dhawan : ప్రస్తుతానికి సమంత చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేకుండా బ్రేక్ ఎంజాయ్ చేస్తోంది. గత ఏడాది ఆమె మయోసైటీస్ బారిన పడడంతో ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్టులో భాగం కాకుండా సైలెంట్ గా జీవితాన్ని గడిపేస్తోంది. అయితే ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం వలన ఎక్కువ ఫ్రీ టైం దొరకడంతో సోషల్ మీడియాలో సమయం వెచ్చించడానికి ఆసక్తి చూపిస్తుంది. దీంతో తాజాగా వరుణ్ ధావన్ షేర్ చేసిన ఒక పోస్టర్ మీద ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
Tenant: టెనెంట్ ఎదురింట్లో, పక్కింట్లో జరిగే కథ!
వరుణ్ ధావన్ తాజాగా ఒక పోస్టర్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ పోస్టర్ కింద సమంత ఎవరు ఈ టీనేజ్ కుర్రాడు అని కామెంట్ పెట్టింది. వరుణ్ ధావన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ కుర్రాడు ఈ మధ్యనే ఈ కామెంట్ పెట్టిన హాట్ బ్యూటీతో ఒక సిరీస్ చేశాడు అంటూ సమంత మీద హాట్ అంటూ కామెంట్స్ చేసేసాడు. ప్రస్తుతానికి ఈ పోస్టు, దాని కింద సమంత కామెంట్ రెండు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి వీరిద్దరూ కలిసి రాజ్ డీకే దర్శకత్వంలో సిటాడల్ ఇండియన్ వర్షంలో నటించారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ఈ సిరీస్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక వరుణ్ పోస్టర్ కి సమంత కామెంట్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.