Kannur Squad Streaming Now in Telugu:మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘కన్నూర్ స్క్వాడ్’ తెలుగులో రిలీజ్ అయింది. మలయాళ నాట సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మమ్ముట్టి నటించిన ఈ చిత్రం తాజాగా OTTలో అందుబాటులోకి వచ్చింది, ఈ క్రైమ్ థ్రిల్లర్ అసాధారణమైన స్పందనను అందుకుంటుంది. కన్నూర్ స్క్వాడ్ ప్రపంచవ్యాప్తంగా 85Cr కలెక్షన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కన్నూర్ స్క్వాడ్ ఇప్పుడు తెలుగులో OTTలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రసారం అవుతోంది. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ కాగా మలయాళ సినిమాల ఫార్ములాలో కంటెంట్ ఫస్ట్ స్టార్ నెక్స్ట్ లాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నూర్ స్క్వాడ్, అంటే మమ్ముట్టి నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం.
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో.. ?
నలుగురు దొంగలతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ హత్య-దొంగతనం చేసి తప్పించుకుంటుంది. కన్నూర్ స్క్వాడ్ తమకు దొరికిన అన్ని లింక్‌లతో ఆ నేరస్తులను ఎలా పట్టుకుంది అనేది కథలోని ప్రధానాంశం. ఆ క్రిమినల్ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ఆ నలుగురు పోలీసులు ఇండియా మొత్తం తిరుగుతారు. వారి ప్రయాణాన్ని థ్రిల్లింగ్‌గా మరియు భావోద్వేగంగా చూపించారు. సినిమా నెమ్మదిగా మొదలవుతుంది కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఊపందుకుమొ, 2వ సగంలో సాలిడ్ అవుతుంది. ఇక ఈ సినిమా కు సినిమాటోగ్రాఫర్ రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించాడు. ముహమ్మద్ షఫీ – రోనీ డేవిడ్ రాజ్ స్క్రీన్ ప్లే రాయగా ASI జార్జ్ మార్టిన్‌గా మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా, విజయ రాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, కిషోర్ కుమార్ G, శబరీష్ వర్మ మరియు సన్నీ వేన్‌లు నటించారు.