Site icon NTV Telugu

RRR : బాలీవుడ్ సైలెన్స్ కు కారణమేంటి?

RRR

రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి నేటి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అంతే ! “బాహుబలి-2” సెన్సేషన్‌ తర్వాత ఆయన తెరకెక్కించిన “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితం బాహుబలితో సృష్టించిన రికార్డును ఇటు సౌత్ నుంచి అటు నార్త్ దాకా ఒక్క చిత్రం కూడా బ్రేక్ చేయలేకపోయింది. అన్నీ నాన్ బాహుబలి రికార్డులే ! ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మాత్రమే ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

Read Also : Macherla Niyojakavargam First Attack : మాచర్ల మాస్ మొదలు.. యాక్షన్ ప్యాక్డ్ టీజర్

అన్ని భాషల్లోని ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ నోరు మెదపక పోవడం గమనార్హం. కరణ్ జోహార్, రణబీర్ కపూర్ వంటి ఒకరిద్దరు సెలెబ్రిటీలు తప్ప ఇంకెవరూ సినిమా గురించి కనీసం పెదవి కదపకపోవడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు థియేటర్లలో నార్త్-ఇండియా అభిమానుల హంగామా వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ సెలెబ్రిటీలు మాత్రం సినిమాపై మౌనం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన అలియా కూడా పెద్దగా స్పందించలేదు. మరి దీనికి కారణం, అర్థం ఏంటో !?

Exit mobile version