Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ఎలాంటి సీక్వెల్ బ్యాకప్ లేకుండా ఒక ప్యూర్ స్టాండ్అలోన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం.. నార్త్ ఇండియా పరిస్థితి ఏంటనేది ఫ్యాన్స్ లో ఉన్న డౌట్. రామ్ చరణ్ సినిమాలకు హిందీలో ఇంతవరకు మంచి ఓపెనింగ్ లేదు. గేమ్ ఛేంజర్ కూడా డిజాస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే పెద్ది విషయంలో మేకర్స్ భారీ స్కెచ్ వేస్తున్నారు. హిందీ బెల్ట్‌లో ఏకంగా 1000కి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చరణ్ సోలో మార్కెట్ స్టామినాను నిరూపించేందుకు పెద్ది అత్యంత కీలకంగా మారడంతో అటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ట్రేడ్ అంచనాల ప్రకారం.. హిందీ మార్కెట్లో ఈ సినిమాకు మొదటి రోజు రూ. 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తే గనుక అది అదిరిపోయే స్టార్ట్‌గా భావించవచ్చు. ఒకవేళ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ కనుక వస్తే నార్త్ ఇండియాలో ఈ చిత్రం లాంగ్ రన్లో రూ. 75 కోట్ల నుండి రూ.100 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వక మొదటి రోజు ఓపెనింగ్స్ రూ. 8 కోట్ల లోపే నమోదైతే మాత్రం సినిమా రన్ ఊపందుకోవడం కష్టమేనని ట్రేడ్ భావిస్తోంది. అదే గనుక జరిగితే లాంగ్ రన్లో క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 40 నుండి రూ. 50 కోట్ల దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే ట్రైలర్ మరియు ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా హిందీ బెల్ట్‌లో గట్టిగా హైప్ క్రియేట్ చేయడంపైనే ఇప్పుడు చిత్ర యూనిట్ పూర్తి ఫోకస్ పెట్టాల్సి ఉంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!