Site icon NTV Telugu

NTR: తారక్ కు అస్వస్థత.. అసలు ఏమైంది..?

Ntr

Ntr

NTR: సోషల్ మీడియా వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో అస్సలు తెలియకుండా పోతోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా తమ లైక్స్ కోసం షేర్స్ కోసం అస్వస్థత గురిచేస్తున్నారు పలువురు. ఇక యూట్యూబ్ ఛానెల్స్, థంబ్ నెయిల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక గత రెండు రోజుల నుంచి తారక్ అస్వస్థతకు గురయ్యాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఎన్టీఆర్ కు ఏమైంది అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఆ వార్తలో ఏమున్నదంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలిన విషయం విదితమే. ఆ గాయం వలన ఎన్టీఆర్ భుజం తీవ్ర ఒత్తిడికి గురయ్యిందని, భుజం నొప్పి భరించలేక ఎన్టీఆర్ హాస్పిటల్ లో చేరినట్లు చెప్పుకోస్తున్నారు. అంతేకాకుండా ఈ నొప్పి వలనే ఎన్టీఆర్- కొరటాల సినిమా ఇంకా ఆలస్యం కానున్నట్లు చెప్పుకొస్తున్నారు.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ఇదంతా ఫేక్ న్యూస్ అని, ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు సన్నహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ తన మేనత్త ఉమా మహేశ్వరీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు. ఇక కొరటాల సినిమాకు మరికొంత సమయం పట్టనున్నదని, స్క్రిప్ట్ లో మార్పులు చేస్తుండడం వలన ఆలస్యం అయ్యిందే తప్ప ఎన్టీఆర్ ఆరోగ్యం వలన కాదని తెలుస్తోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మవద్దని, వీటివలన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అభిమానులు కామెన్స్ చేస్తున్నారు.

Exit mobile version