ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ ఏడాది ఆగస్టు లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. ఇకపోతే బన్నీ ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్తాడు.. తాజాగా బన్నీ గురించి ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..
బన్నీ స్నేహ రెడ్డిని వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అంతే కాకుండా.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తూ అప్పుడప్పుడు ట్రిప్ లకు చెక్కెస్తుంటారు.. అప్పుడు అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ముఖ్యంగా తన పిల్లలకు సంబందించిన ఫోటోలను స్నేహా ఎప్పుడు అభిమానులతో పంచుకుంటుంది..
ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. భార్య స్నేహను అల్లు అర్జున్ ముద్దుగా ఏమని పిలుస్తారు అనే డౌట్ వచ్చింది ఫ్యాన్స్‌కు.. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు.. బన్నీ తన భార్యను క్యూటీ అని పిలుస్తాడట.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా గ్యాండ్ గా రిలీజ్ కాబోతుంది..
