బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. 90వ దశకంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు బోయ జంగయ్య రాసిన ‘అడ్డదారులు’ అనే రచన ఆధారంగా ‘వీకెండ్ పార్టీ’ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్ తో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు సదాచంద్ర కూడా ఇందులోని పాటలను రాశారు. అద్దంకి రామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేయడం విశేషం.
Read Also : Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి
ఓ వీకెండ్ లో నలుగురు అమ్మాయిలు నాగార్జున సాగర్ కు వెళ్ళగా అక్కడ వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర కథ. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. పాశం నరసింహారెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, ఎన్. రేఖ ఈ చిత్రానికి సహనిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తామని, మంచి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారని దర్శకుడు అమరేందర్ తెలిపారు.
