నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. భారతీయ ప్రజలంతా గర్వించాల్సిన విషయం ఇది. ఈ ఆనందాన్ని కొన్నేళ్ల క్రితమే ఒక భారతీయుడిగా మనందరికీ ఇచ్చిన వాడు ఏఆర్ రెహమాన్. ఇండియన్ ప్రొడక్షన్ కాదు కానీ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘స్లమ్ డాగ్ మిలియనేర్’ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీకి గాను రెహమన్ రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ కేటగిరిల్లో రెహమాన్ కి ఆస్కార్ అవార్డ్స్ లభించాయి. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో చాలా హ్యాపీగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రెహమాన్ ఇటీవల సంగీత దిగ్గజం ఎల్ సుబ్రమణ్యంతో ఒక ఇంటరాక్షన్ వీడియో చేశాడు. ఈ వీడియోలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ… “భారతదేశం నుండి రాంగ్ సినిమాలు ఆస్కార్‌కు పంపబడుతున్నాయని, అందుకే అవార్డ్స్ గెలవడంలేదని” అన్నాడు.
వరల్డ్ మ్యూజిక్ గురించి కూడా రెహమాన్ ఈ ఇంటరాక్షన్ వీడియోలో మాట్లాడాడు. “మనం వారి సంగీతాన్ని వింటున్నప్పుడు, వారు మన సంగీతాన్ని ఎందుకు వినలేరు? అనే ప్రశ్నని నన్ను నేను అడుగుతూనే ఉంటాను. అప్పుడే మంచి మ్యూజిక్ కంపోజ్ చేస్తాను. బెటర్ ప్రొడక్షన్, బెటర్ క్వాలిటీ, బెస్ట్ మిక్సింగ్ లాంటి విషయాలే నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి” అని రెహమాన్ మాట్లాడాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ కి పంపించి ఉంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ఇంకో ఆస్కార్ అవార్డ్ వచ్చేది అనే మాటలు వినిపిస్తున్న సమయంలో రెహమాన్ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
