Site icon NTV Telugu

Naga Vamsi : వార్2 తెలుగు స్టేట్స్ రిలీజ్.. నాగవంశీ విధ్వంసం

War 2

War 2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్  వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : Thammudu : శిరీష్ నోటి ఫలితం.. ‘తమ్ముడు’కి తిప్పలు తెచ్చింది

ఈ సినిమా తెలుగు రైట్స్ ను సితార ఎంటెర్టైనమెంట్స్ నాగవంశి సుమారు రూ. 90 కోట్లకు కొనుగులు చేసారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక నాన్ తెలుగు సినిమాకు ఈ ధర పలకడం హిస్టరీ. కేవలం ఎన్టీఆర్ నటిస్తుండడంతోనే ఆ రేట్ పలికిందనేది వాస్తవం.  అనుగుణంగానే వార్ 2 తెలుగు స్టేట్స్ రిలీజ్ ను అదే స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాగవంశీ. ఆగస్టు 14న తెల్లవారు జామున షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే అందుకు అందుకోసం థియేటర్స్ తో చర్చలు కూడా చేస్తున్నారట. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వస్తున్న వార్ 2 ను తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బిగ్గెస్ట్ నంబర్స్ ఉండబోతున్నాయి. అలాగే తమిళ సుపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కూలీతో పోటీగా రిలీజ్ అవుతుంది వార్ 2.

Exit mobile version