యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : Exclusive : వార్ 2 ఇన్ సైడ్ టాక్.. NTR ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చు
వార్ 2 ఇన్ సైడ్ టాక్ ను చాలా రోజుల కిందట ఎక్స్ క్లూసివ్ గా మేము అందించాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పకుండా కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుందని కూడా తెలిపాం. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తారక్ ఇదే మాట చెప్పాడు. అయితే ఈ సారి ఏకాంగా ఒకటి కాదు రెండు కాలర్స్ ఎగరేసేలా ఉంటుంది అని చెప్పాడు. దాంతో వార్ 2 పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏమాటకామాట ఎన్టీఆర్ ఒక సినిమా గురించి చెప్పాడంటే మాక్సిమమ్ ఉంటుంది. టెంపర్ నుండి మొన్న వచ్చిన దేవర వరకు ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా జరిగితీరుతుంది మరో డౌట్ అక్కర్లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ ‘వార్ 2’కి బజ్ లేదనేది వాస్తవం కానీ ఒకే ఒక స్పీచ్ తో ఒకే ఒక్క మాటతో సినిమాకు కావల్సినంత బజ్ తీసుకువచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
